![]() |
![]() |
.webp)
కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో సరికొత్తగా రిలీజ్ అయ్యింది. ఇందులో డెబ్జాని తన లవ్ స్టోరీ చెప్పింది. రాబోయే వారం షోలో లవ్ థీమ్ ఇచ్చింది శ్రీముఖి. "చిన్నప్పుడు ఏమన్నా లవ్ స్టోరీస్ ఉన్నాయా నీకు" అని అడిగింది శ్రీముఖి. "ఒకటే ఉంది. అది చిన్నప్పుడు కాదు పెద్దయ్యాకే ఉంది. అది కాస్తా బ్రేకప్ అయ్యింది." అని చెప్పింది. "ఎందుకు బ్రేకప్ అయ్యింది" అని అడిగింది శ్రీముఖి. "ఆ అబ్బాయి చాలా హైపర్ యాక్టివ్ గా ఉన్నాడు.
ప్రతీ శని, ఆదివారాల్లో ట్రిప్స్ కి వెళ్ళిపోతాడు. నేనేమో ఎన్నెన్నో జన్మల బంధం, సత్యభామా" అంటూ సీరియల్స్ చేసుకుంటూ కూర్చున్నాను అంది డెబ్జాని. "ఐతే అతను ఇండస్ట్రీకి సంబంధించినవాడా కాదా" అని శ్రీముఖి అడిగేసరికి డెబ్జాని నీళ్లు నమిలింది. వెంటనే తేజుతో పాటు మిగతా వాళ్లంతా చెప్పేయ్ ఎం కాదు అంటూ ఆట పట్టించారు. తర్వాత శ్రీముఖి డెబ్జాని చేతికి "నాకు వరుడు కావాలి" అని తయారు చేసిన ఒక పోస్టర్ ఇచ్చింది. సోషల్ మీడియాలో "సింగల్ రెడీ టు మింగిల్" అని స్టోరీ పెట్టించింది శ్రీముఖి. ఆ పోస్ట్ కి అమరదీప్ కూడా కామెంట్ చేశాడంటూ శ్రీముఖి చెప్పేసరికి అమరదీప్ కూడా షాకయ్యాడు. "మీలాంటి వాళ్ళు పిలవాలి కానీ స్మశానానికి కూడా వస్తాం" అంటూ చేసిన కామెంట్ ని శ్రీముఖి చదివి వినిపించింది. దాని పైన ఇంకో కామెంట్ ఉంది అది కూడా చదవండి అంటూ ఇమ్మానుయేల్ అనేసరికి అబ్బాయిలంతా అరిచారు. ఇలా ఈ వారం ప్రతీ ఒక్కరి లవ్ స్టోరీని శ్రీముఖి ఈ ఎపిసోడ్ రివీల్ చేయబోతోంది.
![]() |
![]() |